
'తెలుసు కదా' సినిమా నుంచి క్లాసిక్ టీజర్ విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆయన నటించిన మూవీ జాక్ నిరుత్సాహపరిచింది. దీంతో ‘తెలుసు కదా’ మూవీపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించారు.