స్టార్ బాయ్ కొత్త సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే? | Siddu Jonnalagadda announced New Movie With Thsi Director | Sakshi
Sakshi News home page

Siddu Jonnalagadda: సిద్ధు కొత్త సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?

Mar 19 2026 4:11 PM | Updated on Mar 19 2026 4:54 PM

Siddu Jonnalagadda announced New Movie With Thsi Director

టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తెలుసు కదా మూవీతో ప్రేక్షకులను అలరించాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక కొత్త ఏడాదిలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేయలేదు మన యంగ్ హీరో.

తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ అఫీషియల్‌ అనౌన్స్ చేశారు. కొత్త చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ మూవీకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్ సినిమాలు బ్యానర్సపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement