
టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు (Bunny Vasu) ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలకిచ్చే రేటింగ్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో మూవీ రేటింగ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మీ సైట్‌లో.. యాప్‌లో సినిమాలకు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని బన్నీవాసు విమర్శించారు. జర్నలిస్టులు మన చిత్రాలకు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా.. అలాంటప్పుడు మీ రేటింగ్స్ ఎందుకని నిలదీశారు. టికెట్ కొనే సమయంలోనే ఈ సినిమా బాగుంది..ఇది బాగాలేదని రేటింగ్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇవాళ మిత్రమండలి మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కామెంట్స్ చేశారు.
బాగున్నా సినిమాలకు ఎప్పుడు తేడా రాదని బన్నీ వాసు అన్నారు. మీరు కూడా సినిమా మీదే బ్రతుకుతున్నారని గుర్తు పెట్టుకోండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ లైక్స్.. రేటింగ్స్ ఎవరు ఇస్తున్నారో కూడా అథాంటికేషన్ ఉండదని.. దానికి మెకానిజం ఏంటో కూడా తెలియదని బన్నీ వాసు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.
కాగా.. బన్నీ వాసు సమర్పణలో వస్తోన్న చిత్రం మిత్ర మండలి. ఈ మూవీలో ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్‌ఎం, విష్ణు, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విజయేంద్ర ఎస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది.