
ఈ మధ్య సినిమా ప్రెస్మీట్స్లో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. సెలెబ్రిటీలను కించపరుస్తూ ప్రశ్నలు అడిగితే తాము కూడా ‘సెలెబ్రిటీ’అయిపోతామనే అపోహతో కాంట్రవర్సీ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda )ను ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ ఘోరంగా మండిపడ్డారు. ‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న సిద్దుని ఓ మహిళా జర్నలిస్ట్ ‘మీరు నిజ జీవితంలో స్త్రీలోలుడా(వుమనైజర్) ’ అని అడగడంతో స్టేజ్పై ఉన్న సిద్ధుతో పాటు తోటి జర్నలిస్టులకు కూడా ఒక్కసారి షాకయ్యారు.
ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ కాదు సినిమా ఇంటర్వ్యూ అని సిద్ధు కాస్త ఘూటుగానే ఆమెకు సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మహిళా జర్నలిస్టు ప్రశ్నను తప్పుపడుతూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేశారు. తాజాగా ఈ వివాదంపై మరోసారి సిద్ధు స్పందించారు.
తెలుసు కదా సినిమా ప్రచారంలో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన సిద్దు.. ‘వుమనైజర్’ ప్రశ్నపై మరోసారి స్పందించారు. ‘అమె అలా మాట్లాడడం అగౌరవం. మైకు ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు. ఆమె అలా అడిగి..నవ్వుతున్నారు కూడా. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు పద్దతిగా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. మైకు తీసుకోగానే మారిపోయారు.
సినిమా రిలీజ్ ఉంది కదా..ఏం అయినా అడగొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు. సినిమాకు రియల్ లైఫ్‌కి తేడా ఉంటుంది. సినిమాలో హీరో అండర్ కవర్ పోలీసు అయితే..బయట కూడా ఎన్‌కౌంటర్ చేయడు కదా? డ్రగ్స్ తీసుకునే పాత్రలో నటిస్తే..బయట కూడా డ్రగ్స్ తీసుకుంటాడని అనుకుంటామా? సినిమాకి బయటకు తేడా తెలియదా? సీనియర్ జర్నలిస్టులు పద్దతిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. తమిళ హీరో ప్రదీప్ని కూడా ఆమెనె ఏదో అడిగారని, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటిపై ఆలోచించడం వేస్ట్. ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్. పెద్దగా పట్టించుకోను. నా పనిపై నేను ఫోకస్ పెడతా’ అని సిద్దు చెప్పుకొచ్చాడు. కాగా సిద్దు నటించిన తెలుసు కదా మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.