థియేటర్స్‌లోకి ‘సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్’ | Tarakeswari Movie Release Date Out | Sakshi
Sakshi News home page

థియేటర్స్‌లోకి ‘సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్’

Oct 15 2025 6:18 PM | Updated on Oct 15 2025 6:27 PM

Tarakeswari Movie Release Date Out

తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్‌పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వం లో శ్రీకరణ్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ నా టీమ్ నాకు అండగా నిలిచింది. అందుకే ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను. సినిమా పట్ల అందరి కృషి, ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చింది. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. నవంబర్ 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది. వెంకట్ రెడ్డి గారి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం సమకూర్చాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే తృప్తి ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.

హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ ఈ సినిమా ఓ పల్లెటూరిలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ మరిచిపోలేని అనుభవం. వెంకట్ రెడ్డి నంది గారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. కథ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. నవంబర్ 7న థియేటర్లలో కలుద్దాం” అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement