
హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట త్రివిక్రమ్.
కథ రీత్యా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఒక హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని సంప్రదించారని సమాచారం. కథానాయికగా ఆమె దాదాపు ఖరారు అయ్యారట. ఇక వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘వెంకటరమణ: కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్‌ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... ఆనంద నిలయంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి భాగం అయ్యారా? వేచి చూడాల్సిందే.