– సిద్ధు జొన్నలగడ్డ
‘‘డీజే టిల్లు’ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం తర్వాత ఒక నమ్మకాన్ని ఫీల్ అయ్యాను. ‘జాక్’ మూవీ రిలీజ్ తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను. వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన అనుభూతిని, మనశ్శాంతిని ‘తెలుసు కదా’ చిత్రం రిలీజ్ తర్వాత ఫీలయ్యాను. ఈ సినిమా నన్ను ప్రశాంతంగా నిద్ర పోయేలా చేసింది’’ అని సిద్ధు జొన్నలగడ్డ చె΄్పారు.
ఆయన హీరోగా, శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ చిత్రం అప్రిషియేషన్ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతోంది... చూసినవాళ్లకు గుర్తుండి పోతుంది. కొన్నేళ్ల పాటు మీతో ఉండి పోతుంది’’ అని చె΄్పారు.
‘‘మా చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు విశ్వప్రసాద్. ‘‘నన్ను నమ్మి సినిమా నిర్మించిన విశ్వప్రసాద్‌గారికి «థ్యాంక్స్’’ అని తెలిపారు నీరజ కోన. ‘‘తెలుసు కదా’ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత, రచయిత కోన వెంకట్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, నిర్మాతలు బండ్ల గణేశ్, ఎస్‌కేఎన్, డైరెక్టర్ సందీప్ రాజ్, నటుడు వైవా హర్ష, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ పేర్కొన్నారు.


