తెరపై నటన.. బయట మాత్రం మరో ప్రపంచం | Telugu Actress With Ultimate Talents | Sakshi
Sakshi News home page

Telugu Actress: స్టార్ యాక్టర్స్.. నటనతో పాటు వేరే టాలెంట్స్ కూడా!

Dec 8 2025 9:01 PM | Updated on Dec 8 2025 9:01 PM

Telugu Actress With Ultimate Talents

లేడీ యాక్టర్స్ అనగానే అయితే నటిస్తారు లేదంటే పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు పరిస్థితి ఇలానే ఉండేదేమో కానీ ఇప్పుడు చాలా మారింది. ఓ వైపు యాక్టింగ్‌ మరోవైపు పలు విభాగాల్లో ప్రతిభ చూపిస్తూ ఆల్‌రౌండర్స్ అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ లో అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ల ఏమేం చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.

రీసెంట్‌గా టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకున్న నటి ప్రగతి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఓ వయసు దాటిన తర్వాత అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన ఛాన్స్‌ల్ని వదులుకుని గత రెండు మూడేళ్లుగా పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటుకుంది. మొన్నటివరకు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ గెలిచిన ఈ నటి.. ఇప్పుడు అంతర్జాతీయంగానూ అదరగొట్టేసింది. ఈమెని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరం నటీమణులకు ఎంతైనా ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు చూడాల్సిందే)

మెంటల్ మదిలో, చిత్రలహరి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. యాక్టింగ్ మాత్రమే చాలా వాటిలో ప్రతిభ చూపిస్తోంది. ట్రాక్‌పై రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే కారు రేసింగ్ నేర్చుకుంది. మరోవైపు తమిళనాడులో జరిగిన బ్యాడ్మింటన్‌ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ చూపించింది. హీరోయిన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు చాలానే టాలెంట్స్ ఉన్నాయని నిరూపించింది.

ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి కూడా ఇండస్ట్రీలోకి రాకముందు పలు విభాగాల్లో ప్రతిభ చూపించింది. డెంటిస్ట్ డాక్టర్ పట్టా అందుకున్న ఈమె.. టీనేజీలో స్టేట్ లెవల్ స్మిమ్మింగ్, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గానూ ప్రతిభ చూపించి విజయాలు సాధించింది. హీరోయిన్ సదా అయితే ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయింది. ఈమె ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అడవుల్లో తిరుగుతూ తీసిన కృూరమృగాల ఫొటోలే దర్శనమిస్తాయి.

వీళ్లే కాదు ప్రస్తుత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్.. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఫెర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి ఎంటరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే హైదరాబాద్‌లో జిమ్, హోటల్ అంటూ బిజినెస్‌లు చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రస్తుత తరం హీరోయిన్స్.. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా తమ అభిరుచుల్ని చాటుకుంటున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement