చీప్‌ పాత్రలు చేయను: రాశీ ఖన్నా | Raashii Khanna: I Say No To Cheap Roles | Sakshi
Sakshi News home page

Raashii Khanna: దిగజారిపోయేలా కనిపిస్తానంటే ఒప్పుకోను

Nov 29 2025 9:17 AM | Updated on Nov 29 2025 10:31 AM

Raashii Khanna: I Say No To Cheap Roles

ఊహలు గుసగుసలాడే, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, టచ్‌ చేసి చూడు.. ఇలా తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసింది హీరోయిన్‌ రాశీఖన్నా.. కానీ, ఈమధ్య తెలుగులో కంటే పరభాషా చిత్రాలతోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అనే ఏకైక మూవీ చేస్తోంది. హిందీలో 120 బహదూర్‌ మూవీతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించింది. 

అలాంటివాటికి నో
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ.. ఒక మెట్టు దిగి చీప్‌ పాత్రలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. దక్షిణాదిన నేను ఎన్నో కమర్షియల్‌ సినిమాలు చేశాను. ఓ అడుగు ముందుకేసి హిందీలో బలమైన పాత్రల్నే చేయాలనుకున్నాను. కమర్షియల్‌ సినిమాలు చేయడం ఇష్టమే.. కానీ, దానికి కూడా లిమిట్‌ ఉంటుంది. 

దిగజారిపోయేలా ఉంటే మాత్రం..
ఒక్కో యాక్టర్‌కు ఒక్కో రకంగా పరిమితులు ఉంటాయి. నావరకు వస్తే నన్ను చీప్‌గా చూపించే పాత్రలు చేసేందుకు నేను ఒప్పుకోను. ఆ పాత్ర నేను పెట్టుకున్న నిబంధనలను దాటడంతోపాటు, అందులో నేను మరింత దిగజారిపోయినట్లు కనిపిస్తానంటే మాత్రం వెంటనే నో చెప్పేస్తా.. అని రాశీ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో చివరగా 'తెలుసు కదా' సినిమాలో మెప్పించింది.

చదవండి: బిగ్‌బాస్‌ 9: కెప్టెన్‌ కల్యాణ్‌ రిపోర్టింగ్‌ సర్‌!

Advertisement
 
Advertisement
Advertisement