Chiyaan Vikram Cobra Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Cobra Twitter Review: ‘కోబ్రా’ టాక్‌ ఎలా ఉందంటే..?

Aug 31 2022 7:34 AM | Updated on Aug 31 2022 10:25 AM

Cobra Movie Twitter Review In Telugu - Sakshi

తమిళస్టార్‌ చియాన్ విక్రమ్ హీరోగా, వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మీనాక్షి , మృణాళిని హీరోయిన్లుగా నటించారు.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా నేడు(ఆగస్ట్‌ 31) విడుదలైంది. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న విక్రమ్‌ సినిమా ఇది.

ఇందులో పది రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు విక్రమ్‌. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించే వాడట. నటించడం మాత్రమే కాదు, డబ్బింగ్‌లోనూ ఆరు రకాల వేరియేషన్స్‌ చూపించాడట.సైకాలజికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్‌ క్రియేట్‌ అయింది. 

 ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కోబ్రా’ కథేంటి? పది రకాల పాత్రల్లో కనిపించిన విక్రమ్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు?తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. 

‘కోబ్రా’ ఫస్టాఫ్‌ అదిరిపోయిందని, విక్రమ్‌కు కమ్‌బ్యాక్ మూవీ అని కామెంట్‌ పెడుతున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉందని చెబుతున్నారు.  అజయ్ జ్ఞానముత్తు స్క్రీప్‌ప్లై బాగుందని పోస్ట్‌లు పెడుతున్నారు. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అని కామెంట్‌ చేస్తున్నారు. 

అజయ్‌ స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉందని, విక్రమ్‌ తనదైన నటనతో అదరగొట్టేశాడని అంటున్నారు. 2022లో ఉత్తమ నటుడు అవార్డు విక్రమ్‌కే దక్కుతుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement