
విశాఖకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా భారీ వర్షం కురిసింది.

కేవలం అరగంట మాత్రమే తెరిపినిచ్చి మళ్లీ కొనసాగింది. ఈ అల్పపీడనం సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.



























