కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్ | Hero Nani Movie Hit 3 Team Visits Tirumala Ahead Of Release, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Hit 3 Team: కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న నాని, శ్రీనిధి శెట్టి

Apr 27 2025 7:41 AM | Updated on Apr 27 2025 12:39 PM

Hero Nani Movie Hit 3 Team Visits Tirumala Ahead Of Release

నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్‌ డైరెక్టర్‌ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్‌ సర్కార్‌ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement