టాలీవుడ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కిరణ్ అబ్బవరం మూవీ వాయిదా..! | Kiran abbavaram Ka Production Hatah Movie Postponed | Sakshi
Sakshi News home page

Hatah Movie: టాలీవుడ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కిరణ్ అబ్బవరం మూవీ వాయిదా..!

Nov 5 2026 7:30 AM | Updated on Nov 5 2026 7:30 AM

Kiran abbavaram Ka Production Hatah Movie Postponed

కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటికే తన బ్యానర్‌లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో నిర్మాతగా మారారు. తాజాగా తన క ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో మరో సినిమా నిర్మిస్తున్నారు. ఈ సారి థ్రిల్లర్‌ జానర్‌లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కుష్లు మద్దాల, రెహ్మాన్‌, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో వస్తోన్న థ్రిల్లర్ మూవీ హతః. ఈ సినిమాకు అనుష్ గోరాక్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నవంబరు 6న ఈ మూవీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీని అనౌన్స్ చేస్తామని కిరణ్ అ‍బ్బవరం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అభిమానులకు మరింత ‍అనుభూతిని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దీంతో దీపావళికి ఈ మూవీ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కాగా.. ఈ సినిమాకు జేసిన్ జార్జ్ సంగీతమందిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement