కిరణ్ అబ్బవరం నిర్మాణంలో మరో సినిమా.. ఆసక్తిగా టీజర్
కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటికే తన బ్యానర్లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో నిర్మాతగా మారారు. తాజాగా తన క ప్రొడక్షన్స్ నిర్మాణంలో మరో సినిమా వచ్చేస్తోంది. ఈ సారి థ్రిల్లర్ జానర్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో వస్తోన్న థ్రిల్లర్ మూవీ హతః. ఈ సినిమాకు అనుష్ గోరాక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లోని సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబరు 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు జేసిన్ జార్జ్ సంగీతమందిస్తున్నారు.