
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. ఈనెల మొదట్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మంచి టాక్ తెచ్చుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ ప్రదర్శితమవుతోంది. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందని అంటున్నారు. ఇంతకీ దీని సంగతేంటి?
హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రెండు పార్ట్స్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోగా.. ఇందులో మాత్రం సస్పెన్స్ తో పాటు యాక్షన్, రక్తపాతాన్ని కాస్త గట్టిగానే దట్టించారు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి కాస్త దూరం జరిగారు. రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే వారం చివర్లో లేదంటే జూన్ 5న ఓటీటీలోకి ఈ సినిమా రావొచ్చని తెలుస్తోంది. దీనితో పాటు సూర్య 'రెట్రో' కూడా కాస్త అటుఇటుగా ఇదే తేదీల్లో స్ట్రీమింగ్ అవ్వొచ్చు.
హిట్ 3 విషయానికొస్తే.. అర్జున్ సర్కార్ (నాని) స్ట్రిక్ట్ పోలీస్. విచిత్రమైన మర్డర్ జరిగితే దాన్ని దర్యాప్తు చేస్తుంటాడు. అయితే ఇలాంటి హత్యలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయని తెలుస్తుంది. దీంతో ఆ టాస్క్ మీద అర్జున్ పూర్తిగా దృష్టిపెడతాడు. ఇంతకీ ఈ మర్డర్స్ వెనక ఉన్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!)