
నాని 'హిట్3: ది థర్డ్ కేస్'(HIT: The Third Case) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరో నాని కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరిపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ దుమ్మురేపాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా ఏంటో చూపించనున్నాడు.
'హిట్3: ది థర్డ్ కేస్' సినిమా మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది. రాబోవు సినిమాల జాబితాలో హిట్3ని నెట్‌ఫ్లిక్స్ చేర్చించి. గురువారం (మే 29)న స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. ఇప్పటికే 'ప్యారడైజ్' షూటింగ్‌లో నాని జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.

కథేంటంటే..
ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్‌సైట్ గురించి చెబుతాడు.
అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్‌సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల (శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.