వెంకీ-త్రివిక్రమ్.. హీరోయిన్ దొరికిందా? | Venkatesh Pair Up With Kgf Actress Srinidhi Shetty | Sakshi
Sakshi News home page

Venkatesh: వెంకటేశ్ కోసం యంగ్ హీరోయిన్?

Sep 2 2025 7:21 PM | Updated on Sep 2 2025 7:49 PM

Venkatesh Pair Up With Kgf Actress Srinidhi Shetty

ఈ ఏడాది మొదటలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఊహించని హిట్ కొట్టిన వెంకటేశ్.. చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పారు. లెక్క ప్రకారం త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో ఓ మూవీ చేయాలి. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆలస్యమైంది. అలానే ఆ ప్రాజెక్ట్ చేతులు మారింది. బన్నీ ప్లేసులో తారక్ వచ్చాడు. అయినా సరే షూటింగ్‌కి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. దీంతో త్రివిక్రమ్-వెంకీ ప్రాజెక్ట్ సెట్ అయింది.

(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)

కొన్నిరోజుల క్రితమే పూజతో అధికారికంగా సినిమా లాంచ్ అయింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని మొన్నటివరకు వినిపించింది. ఇప్పుడు ఆ స్థానంలో మరో కన్నడ భామనే వచ్చినట్లు తెలుస్తోంది. 'కేజీఎఫ్' చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టిని కథానాయికగా అనుకుంటున్నారట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో మరో లక్కీ ఛాన్స్ అవుతుంది.

ఈ ఏడాది నాని 'హిట్ 3'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది. ప్రస్తుతం సిద్ధు సరసన 'తెలుగు కదా' అనే మూవీలోనూ చేస్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్-వెంకీ సినిమాలో ఛాన్స్ అంటే విశేషం. ఒకవేళ ఇది నిజమై, సినిమా హిట్ అయితే గనక శ్రీనిధికి మరిన్ని ఆఫర్స్ రావొచ్చు. ఇకపోతే ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవుతుందని, వచ్చే వేసవికి రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయాలపై ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు: కృతి సనన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement