
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇటీవలే ప్రకటించారు. అనిల్ రావిపూడితో కలిసి బ్లాక్‌బస్టర్ విక్టరీ కొట్టిన వెంకటేశ్ నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీని కుటుంబ కథాచిత్రంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో 77వ చిత్రంగా నిలవనుంది.
వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. వీరిద్దరి కలిసి మరోసారి మ్యాజిక్‌ను సృష్టించడానికి సెట్స్‌పైకి వెళ్లనున్నారని రాసుకొచ్చారు. వెంకీతో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️
The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬
Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P— Naga Vamsi (@vamsi84) October 8, 2025