ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్ | Samantha Sparks Dating Rumors with Raj Nidimoru After Dubai Outing | Sakshi
Sakshi News home page

Samantha: రిలేషన్ విషయం చెప్పకనే చెబుతోందా?

Sep 2 2025 2:56 PM | Updated on Sep 2 2025 3:17 PM

Samantha Dubai Trip With Raj Nidimoru

సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్ని నెలల క్రితం 'శుభం' అనే చిన్న చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ హిట్ కాలేదు గానీ పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మరోవైపు సమంత రిలేషన్ గురించి గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఫొటోనో వీడియోనో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సామ్.. దుబాయి వెళ్లినట్లు అనిపిస్తుంది.

గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉంటుంది. అయితే సామ్‌ తనతో 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' సిరీస్‌లు తీసిన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని పుకార్లు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు వీళ్లిద్దరూ అడపాదడపా కలిసి కనిపిస్తుండటం వీటికి ఊతమిస్తోంది.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్‌గా మొదలుపెట్టేశారు)

తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లిన సమంత.. ఆ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులోనే ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపించింది. అయితే ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో దిగువన వరుణ్ ధావన్, దిశా పటానీ, రుహానీ శర్మ తదితరులు కామెంట్ కూడా చేశారు.

మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లయింది. శ్యామలిని 2015లో వివాహమాడారు. రీసెంట్ టైంలో సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. మరి సమంత.. ఈ బంధాన్ని ఏమైనా అధికారికంగా ప్రకటిస్తుందా లేదా ఇలానే రహస్యంగా ఉంచుతుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు: కృతి సనన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement