దుబాయ్‌ ట్రిప్‌లో సమంత.. ఆమెతో పాటే అతను కూడా! | Samantha Ruth Prabhu Holiday Trip With Raj Nidimoru In Abu Dhabi, See Netizens Reactions On It | Sakshi
Sakshi News home page

Samantha Abu Dhabi Trip: దుబాయ్‌లో సమంత చిల్.. ఆ ఫోటోలో ఉన్నది అతనేనా?

Jun 9 2025 2:55 PM | Updated on Jun 9 2025 3:32 PM

Samantha holiday trip with Raj Nidimoru in Abu Dhabi netizens comments

టాలీవుడ్ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన నెటిజన్స్‌ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఫోటోల్లో  మరో వ్యక్తి కనిపించడంతో మరోసారి చర్చకు దారితీసింది. షూటింగ్ చేస్తూ సమంత కనిపించగా.. అందులో ఉన్నది కచ్చితంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కామెంట్స్‌ పెడుతున్నారు. సామ్ ఫోటోలను కూడా అతనే తీశాడని రాసుకొస్తున్నారు.

ఈ ఫోటోలు వైరల్ కావడంతో అబుదాబి సెలవులకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సమంత చిల్ ‍అవుతున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొన్ని నెలలుగా సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్‌పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో ఆ వార్తలు తెగ వైరలయ్యాయి.  ఇటీవల రాజ్ భార్య భార్య శ్యామలి దే సైతం సమంతతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని ఉద్దేశించి పోస్ట్ రాశారు. అయితే తమ రిలేషన్‌పై ఇప్పటి వరకు సమంత కానీ.. రాజ్‌ కానీ స్పందించలేదు.

ఇటీవల విడుదలైన సమంత నిర్మించిన శుభం సక్సెస్‌ మీట్‌లోనూ రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. అంతకుముందు సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2','సిటాడెల్: హనీ బన్నీ'వెబ్ సిరీస్‌ల్లో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు నెట్‌ఫ్లిక్స్ రానున్నా 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్' కోసం జతకట్టారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement