
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా లైంగిక వేధింపులు లాంటివి ఏదో మూల వినిపిస్తూనే ఉంటాయి. ఈ విషయమై అప్పుడప్పుడు పలువురు కథానాయికలు స్పందిస్తూనే ఉంటారు. తమ అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ కృతి సనన్ అలాంటి ఓ విషయం గురించి మాట్లాడింది. హీరోయిన్లని చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.
'సౌకర్యాల విషయంలోనే కాదు.. గౌరవించడంలోనూ చిన్నచూపు చూస్తుంటారు. హీరోలకు పెద్దకార్లు, లగ్జరీ రూమ్స్ ఇస్తారు. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు. కానీ అలా ఎందుకు చేస్తారని బాధపడుతుంటాను. కేవలం కార్లు, సౌకర్యాల గురించే కాదు మహిళలని తక్కువ చేసి చూడటం గురించి నేను మాట్లాడుతున్నాను. హీరోలతో సమానంగా గౌరవించడానికి మేం కూడ అర్హులమే. షూటింగ్ విషయంలోనూ ఇలానే జరుగుతోంది'
(ఇదీ చదవండి: పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్)
'హీరోలు సెట్స్‌కి ఆలస్యంగా వస్తారు. కానీ హీరోయిన్లు మాత్రం టైమ్ కంటే ముందే వెళ్లి వారి కోసం ఎదురుచూస్తూ ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్లు నన్ను ముందే సెట్స్‌కి రావాలని పిలుస్తారు. హీరోలకు మాత్రం ఆ మాట చెప్పలేరు. ఇలాంటి ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి' అని కృతి సనన్ తన ఆవేదన బయటపెట్టింది.
కృతి సనన్‌కి ఏయే సినిమాలు, హీరోలతో ఇలాంటి అనుభవం ఎదురైందో గానీ ధైర్యంగా బయటకు చెప్పింది. మిగతా హీరోయిన్లు మాత్రం కొందరు ఇలాంటి వాటికి సర్దుకుపోతూ ఉంటారు. 2023లో 'ఆదిపురుష్' మూవీతో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని పలకరించిన కృతి సనన్.. తర్వాత ఓ నాలుగు చిత్రాలు చేసింది గానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అవికూడా అప్ కమింగ్ హీరోలతో చేస్తున్నావే. ఈమె స్టార్ హీరోలతో పనిచేసే చాలాకాలమైపోయింది.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్‌గా మొదలుపెట్టేశారు)