
షారుక్ ఖాన్‌తో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను తెరకెక్కించి, హిట్స్ అందుకున్నారు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. తాజాగా ఫర్హాన్ డైరెక్షన్‌లోనే ‘డాన్ 3’ రానుంది. అయితే ‘డాన్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా చేయడం లేదు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీని ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాలేదు. కాగా ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చారు కియారా. దీంతో కియారా సెట్స్‌కు రావడం కుదరదని, ఆమె ప్లేస్‌లో మేకర్స్ కృతీ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
ఓ దశలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంకా చోప్రా ‘డాన్ 3’లోనూ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రణ్‌వీర్ సింగ్. డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీంతో ముందుగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు రణ్‌వీర్.
ఆ విధంగా ‘డాన్ 3’ చిత్రీకరణ వాయిదా పడింది. జనవరిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు మేకర్స్. ఎలాగూ ‘డాన్ 3’ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ముందుగా ప్రకటించినట్లుగానే హీరోయిన్‌గా కియారా అద్వానీనే నటింపజేయాలనుకుంటున్నారట. ఇక ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ పాట ఉన్న విషయం తెలిసిందే.
ఈ పాపులర్ సాంగ్‌ను ‘డాన్ 3’లో రీమిక్స్ చేసి, ఈ స్పెషల్ సాంగ్‌లో కృతీ సనన్‌తో డ్యాన్స్ చేయిస్తే బాగుంటుందని, ఈ సాంగ్‌లో ప్రియాంకా చోప్రా గెస్ట్‌గా కనిపిస్తే బాగుంటుందని ఫర్హాన్ భావిస్తున్నారట. ఆ దిశగా కృతీతో చర్చలు జరుపుతోందట ‘డాన్ 3’ టీమ్. మరి... ‘ఆజ్ కీ రాత్’ సాంగ్‌లో రణ్‌వీర్‌తో కలిసి కృతీ సనన్ స్టెప్పులేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు సంగీతం అందించిన శంకర్–ఇషాన్–లాయ్ త్రయమే ‘డాన్ 3’కీ సంగీతం అందించనున్నారు.