
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ సైతం డిజిటల్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. మానవ్ కౌల్, భాషా సుంబ్లి నటించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ పంచుకున్నారు. ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. కశ్మీర్‌లోని బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డిఎస్పీ రిద్వాన్ సయ్యద్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిద్వాన్ బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు అదృశ్యమవుతాడు? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే బారాముల్లా కథ. ఈ చిత్రాన్ని బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య, లోకేష్ ధార్‌తో కలిసి జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
Welcome to the town, where truth is a myth, and myths have truth. Enter the world of ‘Baramulla’ on 7th November. Only on Netflix.#BaramullaOnNetflix pic.twitter.com/pB7swLUIYm
— Netflix India (@NetflixIndia) October 17, 2025