
అసలే దసరా సెలవులు.. చూస్తుండగానే అయిపోతున్నాయి. మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ పండుగకు అలరించేందుకు కాంతార చాప్టర్-1, ఇడ్లీ కొట్టు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇవీ తప్ప పెద్దగా సినిమాలేవీ దసరాకు రిలీజ్ కాలేదు. కాంతార మూవీపై భారీ అంచనాలు ఉండడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు.
ఇక ఓటీటీల విషయానికొస్తే అదే పరిస్థితి నెలకొంది. ఈ శుక్రవారం పెద్దగా మూవీస్ ఏవీ స్ట్రీమింగ్ కావట్లేదు. మైనే ప్యార్ రియా అనే మలయాళ సినిమా, హాలీవుడ్ చిత్రాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పెద్దగా బజ్ చిత్రాలేవీ కనిపించడం లేదు. అయితే దసరా సెలవులు కావడంతో కాస్తా డిఫరెంట్ సిరీస్, సినిమాలు ట్రై చేసే వాళ్లు ఓ లుక్కేయ్యొచ్చు. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.
నెట్‌ఫ్లిక్స్..
స్టీవ్(హాలీవుడ్ మూవీ)- అక్టోబరు 03
మాన్‌స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03
జెనీ మేక్ ఏ విష్(కొరియన్ సిరీస్)- అక్టోబరు 03
ఓల్డ్ డాగ్.. న్యూ ట్రిక్స్(స్పానిష్ కామెడీ సిరీస్)- అక్టోబరు 03
ది న్యూ ఫోర్స్(స్వీడీష్ మూవీ)- అక్టోబరు 03
జీ5
డాకున్ కా ముండా-3(పంజాబీ మూవీ)- అక్టోబర్ 03
జియో హాట్‌స్టార్
బిగ్‌బాస్ తమిళ్(రియాలిటీ షో)- అక్టోబర్ 05
లయన్స్ గేట్ ప్లేమైనే ప్యార్ కియా(మలయాళ సినిమా)- అక్టోబరు 03
ఆపిల్ ప్లస్ టీవీ
లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03
హులు
వేర్ వాల్వ్స్- అక్టోబర్ 03