ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్‌ నో క్రేజ్‌.. ఓటీటీలో సూపర్ రికార్డ్! | Jr Ntr War 2 makes digital debut Indias most watched film in last week | Sakshi
Sakshi News home page

Jr Ntr War 2: ఓటీటీలో వార్-2 రికార్డ్.. ఏకంగా రజినీకాంత్ కూలీనే!

Oct 14 2025 4:41 PM | Updated on Oct 14 2025 6:33 PM

Jr Ntr War 2 makes digital debut Indias most watched film in last week

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.

అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్‌-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement