లా ఫర్మ్‌ల కతలు | Hollywood movie The Trial ott review | Sakshi
Sakshi News home page

లా ఫర్మ్‌ల కతలు

Sep 28 2025 12:58 AM | Updated on Sep 28 2025 12:58 AM

Hollywood movie The Trial ott review

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్‌’ రెండో సీజన్‌ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.

ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్‌లపై తీసిన సిరీస్‌ ‘ది ట్రయల్‌’. 2023లో ఈ సిరీస్‌ మొదటి భాగం హాట్‌ స్టార్‌ వేదికగా రిలీజ్‌ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్‌’ రెండో సీజన్‌ రిలీజ్‌ అయింది. కాజోల్‌ ప్రధాన  పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్‌ దేవగన్‌ ఈ సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

రెండు సిరీస్‌లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్‌’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌ కథాంశానికొస్తే... న్యోనికాసేన్‌ గు΄్తా ఓ పేరున్న ఫర్మ్‌లో మంచి లాయర్‌. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్‌లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్‌ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. 

ఆ లా ఫర్మ్‌లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్‌లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్‌ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్‌లోనే చూడాలి. హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘ది ట్రయల్‌’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్‌ కతలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్‌.     – హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement