దక్షిణ మధ్య రైల్వే 2025 క్యాలెండర్ సంవత్సరంలో, అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. ఈ కాలంలో, ఈ జోన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన రైళ్ల ప్రవేశపెట్టడం, స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాల పెంపు, సిబ్బంది సంక్షేమం, లోడింగ్, రాబడి సృష్టి మరియు భద్రతను పెంపొందించడం మొదలైన విషయాలలో నూతన శిఖరాలను అధిరోహించి, అనేక మైలురాళ్లను దాటినట్లు పేర్కొంది.

2025 క్యాలెండర్ సంవత్సరంలో రైల్వే సాధించిన విజయాలు.
తెలంగాణ రాజధాని నగర ప్రాంతంలోని (హైదరాబాద్) మూడు ప్రధాన టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి ప్రయాణికులకు సులభమైన, ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందించడానికి, చర్లపల్లిలో ఒక నూతన శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి చేసి ప్రధానమంత్రి చే జనవరి 2025లోప్రారంభించబడింది.
జోన్ లోని వైద్య విభాగం ఫిబ్రవరి 2025లో రైల్వే అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్టుల మొదటి వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది.
మార్చి-2025లో రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్‌లో 64 స్లైసెస్ సిటి స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ మరియు వరంగల్ అనే మూడు ముఖ్యమైన రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసింది. వీటిని ప్రధానమంత్రి మే 2025లో వర్చువల్‌గా ప్రారంభించారు.
ఇండో-సార్సెనిక్/ ఇండో-గోతిక్ వాస్తుశిలిలో నిర్మించబడిన కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వాన్ని సరైన కాంతివిధానంతో చాటి చెప్పడానికి రూ. 2.2 కోట్ల వ్యయంతో కాచిగూడ హెరిటేజ్ స్టేషన్‌కు వాస్తుశిల్ప సుందరీకరణతో విద్యుత్ దీపాలంకరణ పూర్తిచేసింది.కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి జూన్ 2025లో దీనిని దేశానికి అంకితం చేశారు.

జూన్ 2025లో, రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్‌లో అంతర్గత కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు
గౌరవ రైల్వే కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ జూలై 2025లో కాచిగూడ ,భగత్ కీ కోటి మధ్య రోజువారీ రైలును ప్రవేశపెట్టి జెండా ఊపి ప్రారంభించారు.
మార్గమధ్యంలో రైలు ఆలస్యాలను తగ్గించడానికి మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి జూలై, 2025లో పెద్దపల్లి జంక్షన్ వద్ద ఒక కీలకమైన బైపాస్ లైన్ ప్రారంభించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఆగస్టు, 2025లో సి.ఎస్.టి.ఎం మరియు జాల్న మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించి, జెండా ఊపి ప్రారంభించారు.
రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న డిసెంబర్, 2025లో తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య నూతన వీక్లీ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు.

డిసెంబర్, 2025లో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ ల గౌరవ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు.
2025 సంవత్సరంలో జోన్ చేపట్టిన పైన పేర్కొన్న విజయవంతమైన కార్యక్రమాలతో పాటు, ఈ క్రింది తెలియజేయబడిన ప్రధాన మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపుదల ప్రాజెక్టులు, రాబడి సృష్టి మరియు ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి :
దక్షిణ మధ్య రైల్వే జనవరి నుండి నవంబర్, 2025 వరకు ఈ క్రింది విజయాలు సాధించింది
సరుకు రవాణాలో 136.2 మిలియన్ టన్నులు (జనవరి - నవంబర్ 24లో 128.4 మిలియన్ టన్నులతో పోలిస్తే).
సరుకు రవాణా ఆదాయం లో రూ. 12841 కోట్లు(జనవరి - నవంబర్ 24లో రూ. 12597 కోట్లతో పోలిస్తే)

ప్రయాణీకుల ఆదాయంలో రూ. 5525 కోట్లు ( సరుకు రవాణా ఆదాయం జనవరి - నవంబర్ 24లో రూ. 5261 కోట్లతో పోలిస్తే)
రూ. 19314 కోట్ల స్థూల మొత్తం ఆదాయం (జనవరి - నవంబర్ 24లో రూ. 18831 కోట్లతో పోలిస్తే)దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరంలో 52 స్టేషన్లు/సేవా భవనాలకు అత్యధిక శూన్య/శూన్య ప్లస్ లేబులింగ్‌ను సాధించింది .ఈ స్టేషన్లు/సేవా భవనాలలో నికర ఇంధన దిగుమతికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నికర ఇంధన ఎగుమతిని సాధించినందుకు భారతీయ రైల్వేలలో ఇది అత్యధికం.
2025 సంవత్సరంలో మూడు గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభించబడ్డాయి.
గుంతకల్లు డివిజన్‌లోని సంజమల వద్ద మెస్సర్స్ రామ్కో సిమెంట్స్
గుంతకల్లు డివిజన్‌లోని యెర్పేడు వద్ద మెస్సర్స్ జగదీష్ , ఇతరులు
గుంటూరు డివిజన్‌లోని జనపహాడ్ వద్ద మెస్సర్స్ డెక్కన్ సిమెంట్స్

68 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు.
22 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మరియు 60 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి.
దక్షిణమధ్య రైల్వే ద్వారా 2025 లో 199 కి.మీ.ల ట్రాక్ జోడింపు (15 కి.మీ. కొత్త లైన్లు, 40 కి.మీ. డబుల్ లైన్ మరియు 144 కి.మీ. మూడవ లైన్)
వాడి వద్ద 24 కి.మీ. పొడవునా విద్యుదీకరణతో పాటు (12 కి.మీ. డబుల్ లైన్) బైపాస్ లైన్‌ను ప్రారంభించారు. దీని వలన వాడి జంక్షన్‌కు వెళ్లకుండా రైళ్లను సజావుగా నడపడానికి సహాయపడుతుంది.దక్షిణ మధ్య రైల్వే 2025లో 184 ట్రాక్ కి.మీ. విద్యుదీకరించింది (డబ్లింగ్‌లో భాగంగా 40 కి.మీ. మరియు మూడవ లైన్‌లో భాగంగా 144 కి.మీ.). అదనంగా, హైదరాబాద్ డివిజన్‌లోని అక్కన పేట్ - మెదక్ సెక్షన్ మధ్య 17 రూట్ కి.మీ మరియు కలబురగి - ఖానాపూర్ సెక్షన్ మధ్య 97 రూట్ కి.మీ కూడా విద్యుదీకరించబడ్డాయి. దీనితో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌లో 100 శాతం విద్యుదీకరణను సూచిస్తుంది.

వివిధ విభాగాలలో 529 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ను విజయవంతంగా ప్రారంభించారు తద్వారా లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఎక్కువ సంఖ్యలో రైళ్ల నిర్వహణకు సహాయపడింది.
జోన్ సెక్షన్ సామర్థ్యాన్ని మరియు రైళ్ల సజావుగా నిర్వహణను పెంచడానికి వివిధ విభాగాలలో తొమ్మిది ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను ప్రారంభించింది.
దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరానికి గాను నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను గెలుచుకుంది - గుంతకల్లు లోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణా కేంద్రం ఉత్తమ పనితీరు గల యూనిట్ అవార్డును పొందగా, రాయచూర్, కాచిగూడ మరియు లింగంపల్లి మొదలైన 3 రైల్వే స్టేషన్లు మెరిట్ సర్టిఫికేట్‌ను పొందాయి.


