చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్ | Allu Arjun Review Chiranjeevi Mana Shankara Varaprasad Garu | Sakshi
Sakshi News home page

Allu Arjun: బ్లాక్‪‌బస్టర్ కాదు ఇది సంక్రాంతి 'బాస్'బస్టర్

Jan 20 2026 3:48 PM | Updated on Jan 20 2026 3:53 PM

Allu Arjun Review Chiranjeevi Mana Shankara Varaprasad Garu

అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు లేవని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే కనిపించిన కొన్ని సంఘటనలు ఇవన్నీ నిజమేనేమో అనిపించేలా చేశాయి. కానీ అదంతా సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమేనని క్లారిటీ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్.. చిరంజీవి కొత్త సినిమాకు తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

తాజాగా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వింటేజ్‌గా అదరగొట్టేశాడని అన్నాడు. వెంకటేశ్, నయనతార, కేథరిన్, బుల్లిరాజు అలియాస్ రేవంత్ కూడా ఆకట్టుకున్నారని రాసుకొచ్చాడు. హుక్ స్టెప్, మెగావిక్టరీ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్‌కి కంగ్రాట్స్ చెప్పాడు. నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటిని ప్రశంసించాడు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రస్తావిస్తూ.. 'సంక్రాంతికి వస్తారు-హిట్ కొడతారు-రిపీట్' అని డైలాగ్ వేశాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. సంక్రాంతి 'బాస్'బస్టర్ అని చిరుకి బన్నీ సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు.

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉందని టాక్ కొందరి నుంచి వినిపించినప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు కూడా.

(ఇదీ చదవండి: పదేళ్లుగా సినిమాలకు దూరమైనా ఇప్పటికీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement