హీరోయిన్ పూజా హెగ్డేకి అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. ఈమె నటించిన 'జన నాయగణ్' లెక్క ప్రకారం ఈ పాటికే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు. పాన్ ఇండియా హీరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే, అతడిని లాగిపెట్టి కొట్టానని చెప్పంది. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే.. ఓ స్టార్ హీరోతో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 'నా కెరీర్ మొదట్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ టైంలో ఓ రోజు.. ఆ హీరో, అనుమతి లేకుండా నా క్యారవాన్‌లోకి వచ్చేశాడు. అసభ్యంగానూ ప్రవర్తించాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను. వెంటనే సదరు హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఆ హీరోతో నటించడానికి నేను ఇష్టపడలేదు. దీంతో నా సీన్స్ అన్నీ డూపుని పెట్టి తీశారు' అని పూజ చెప్పుకొచ్చింది.
మరి పూజా హెగ్డేని ఇబ్బంది పెట్టిన ఆ పాన్ ఇండియా హీరో ఎవరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కెరీర్ ప్రారంభంలో అంటే హృతిక్ రోషన్ 'మొహంజదారో'లో ఈమె నటించింది. దక్షిణాదిలోనూ ఈ మూవీ రిలీజైంది. నాలుగేళ్ల క్రితం ప్రభాస్ 'రాధేశ్యామ్'లో నటించింది. పూజా చేసిన పాన్ ఇండియా మూవీస్ అంటే ఇవే. మరి వీరిద్దరిలో ఎవరైనా పూజతో అసభ్యంగా ప్రవర్తించారా? లేదంటే ఈమె ఏమైనా కట్టుకథ చెబుతోందా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఇకపోతే పూజా చేతిలో ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా, ఓ హిందీ మూవీ ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?)


