పదేళ్లుగా సినిమాలకు దూరమైనా ఇప్పటికీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? | Actress Asin Latest And 10th Wedding Anniversary | Sakshi
Sakshi News home page

Guess The Actress: భర్త బిజినెస్‌మ్యాన్.. పెళ్లయి అప్పుడే పదేళ్లయిపోయిందా?

Jan 20 2026 3:13 PM | Updated on Jan 20 2026 3:37 PM

Actress Asin Latest And 10th Wedding Anniversary

సాధారణంగా హీరోయిన్లు సినిమాలు చేయడం మానేస్తే ఊహించనంతగా మారిపోయి కనిపిస్తుంటారు. చాలా తక్కువమంది మాత్రమే అదే గ్లామర్, అదే ఫిజిక్ మెంటైన్ చేస్తుంటారు. ఈ హీరోయిన్ కూడా సేమ్ అలానే కనిపించి ఆశ్చర్యపరిచింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఈమెని చూసేసరికి ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ అసిన్. ఇరవైళ్ల క్రితం తెలుగు, తమిళంలో పలు హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాకు చాలా అంటే చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. ఎంతలా అంటే 2016లో 'మైక్రోమ్యాక్స్' కో-ఫౌండర్ రాహుల్ శర్మని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా బయట కనిపించడమే మానేసింది.

(ఇదీ చదవండి: కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!)

కేరళకు చెందిన ఈమె.. 2001లో మలయాళ సినిమాతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. కానీ తర్వాత సొంత భాషలో మరో మూవీ అనేదే చేయలేదు. 2003లో 'అమ్మనాన్న ఓ తమిళమ్మాయి'తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత శివమణి, లక్ష‍్మీ నరసింహా, ఘర్షణ, చక్రం, అన్నవరం తదితర సినిమాలు చేసింది. తమిళంలోనూ గజిని, పోక్కిరి తదితర చిత్రాలతో హిట్స్ అందుకుంది. అనంతరం హిందీలో పలు హిట్ సినిమాలు చేసింది.

2016లో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిందేమో గానీ 2015లో చివరగా 'ఆల్ ఈజ్ వెల్' అనే హిందీ మూవీలో నటించింది. తర్వాత నుంచి పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. చూస్తుంటే రీఎంట్రీ ఇచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ ఇప్పటికే హీరోయిన్‌గా ఉన్నప్పటి గ్లామర్‌నే మెంటైన్ చేస్తోంది. ఈమె భర్త రాహుల్ శర్మ.. 10వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఒకటి పెళ్లి ఫొటో కాగా.. మరొకటి ప్రస్తుతంలో దిగిన ఫొటో. అలా ఇప్పుడు అసిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement