కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య! | Fitness Trainer Vinod Channa Reveals How John Abraham Hardcore Diet Affects His Digestion, Read Story Inside | Sakshi
Sakshi News home page

John Abraham: ఫిట్‌నెస్ ఎ‍క్కువైనా ఇబ్బందులే.. ఇలా కూడా జరుగుతుందా?

Jan 20 2026 1:52 PM | Updated on Jan 20 2026 2:14 PM

Fitness Trainer Vinod Channa Reveal John Abraham Diet

ప్రస్తుతం ఎవరితో మాట్లాడినా సరే ఆరోగ్యం ఉండండి, డైట్ పాటించండి అని చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. స్క్రీన్ పై కనిపించాలి, గ్లామర్‌గా ఉండాలంటే మన తినే చాలా ఆహార పదార్థాలకు వాళ్లు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫేమస్ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఇప్పుడు అదే చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా చేసిన ఈయన ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రైనర్ వినోద్ చన్నా.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, డైట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో చెప్పాడు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. 'జాన్ పాటిస్తున్న డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయింది. జాన్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. నాలుగు ఫుడ్స్ తినమని చెబితే అవి మాత్రమే తింటాడు. వేరే వాటిని అస్సలు ముట్టుకోడు. అంత కఠినంగా ఉంటాడు'

(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

'ఓసారి సినిమా షూటింగ్‌లో జాన్ ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె వచ్చారు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఫుడ్ అంతా అయిపోయిందని నాతో చెప్పింది. కానీ జాన్ ఆ ఆహారాన్ని అస్సలు టచ్ చేయడని, ఆ విషయంలో నాకు వంద శాతం నమ్మకం ఉందని ఆమెతో చెప్పాను. షుగర్(చక్కెర)కు జాన్ చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతైనా తీసుకోమని చెప్పాను. అయినా సరే నో చెప్పాడు'

'పొరపాటున జాన్ గనుక చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అతడికి దగ్గు వచ్చే అవకాశముంది. ఎన్నో ఏళ్లుగా కఠినమైన డైట్ పాటించడం వల్ల ఇప్పుడు జాన్.. బెండకాయ, వంకాయ లాంటివి తినలేడు. ఒకవేళ తీసుకున్నా సరే అతడి కడుపు వాటిని జీర్ణించుకోలేకపోతోంది. శరీరం ఓ నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే అకస్మాత్తుగా వచ్చే మార్పులని తీసుకోలేదు. జీర్ణ సమస్యలు వస్తాయి' అని వినోద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయంలో ఫిట్‌నెస్, డైట్ పాటించే వాళ్లమధ్య హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement