తమిళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి.. బాలీవుడ్ వరకు వెళ్లి.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)
తమిళ డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అట్లీ.. 'రాజారాణి' మూవీతో దర్శకుడిగా మారాడు. తర్వాత దళపతి విజయ్‌తో తెరి, బిగిల్, మెర్సల్ లాంటి హ్యాట్రిక్ మూవీస్ తీశాడు. 2023లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో తీసిన 'జవాన్'.. అదిరిపోయే సక్సెస్ అయింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ ఓ మూవీ చేస్తున్నాడు.

అట్లీ వ్యక్తిగత విషయాలకొస్తే.. నటి ప్రియని 2014లో పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి మీర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ప్రియ మరోసారి తల్లి కానుంది. చూస్తుంటే బన్నీతో మూవీ రిలీజయ్యేలోపే అట్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు ప్రియ బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)



