
ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్లో వాలిపోయింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్లో తళుక్కున మెరిసింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియా కూడా కనిపించారు. ఇద్దరు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
కృతి-కబీర్ డేటింగ్ రూమర్స్
అయితే ఈ జంట ఇలా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. అప్పట్లో వీరిద్దరు కలిసి వచ్చిన ఓ వీడియో నెట్టంట వైరలైంది. ఈ పెళ్లిలో కృతి సనన్- కబీర్ చాలా సన్నిహితంగా కనిపించారు. లండన్కు చెందిన వ్యాపారవేత్త అయినా కబీర్తో కలిసి చాలాసార్లు విహారయాత్రల్లోనూ కృతి కనిపించింది. అయితే వీరిద్దరికీ దాదాపు ఎనిమిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఇదే మ్యాచ్లో పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు. హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా సైతం లార్డ్స్ టెస్ట్ మ్యాచ్కు హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ను వీక్షించారు.
Kriti Sanon at the Lord's. #AkshayKumar sabke sb pauch gye 😐 waha lanka lagi hui hai
Jadeja 🥳 khel jao #INDvsENG #JHOPE #TestCricket #INDVsENGLive pic.twitter.com/umWT58y0DG— Karan Visible (@Visibleindustry) July 14, 2025