
దంగల్ ఫేమ్ జైరా వాసిం (Zaira Wasim) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిఖా జరిగినట్లు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ముఖం చూపించలేదు కానీ భర్తతో నెలవంకను చూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దంగల్‌తో ఫేమ్
16 ఏళ్ల వయసులో దంగల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది జైరా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో చిన్నప్పటి గీతా ఫొగట్ పాత్రలో యాక్ట్ చేసింది జైరా. ఈ మూవీకిగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాలోనూ యాక్ట్ చేసింది.
సినిమాలకు గుడ్‌బై
ఈ రెండు సినిమాలకుగానూ నేషనల్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన మూడో సినిమా ద స్కై ఈజ్ పింక్. ఇదే తన ఆఖరి సినిమా! తన విశ్వాసాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. సోషల్ మీడియాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేయాలని అభిమానులను కోరింది.
చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం