
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్(Pankaj Dheer) ( 68) ఇవాళ కన్నుమూశారు. కొన్నేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే క్యాన్సర్‌కు పలుసార్లు శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని విలే పార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
(ఇది చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు)
కాగా.. పంకజ్ ధీర్ నవంబర్ 9.. 1956న పంజాబ్‌లో జన్మించారు. 1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించారు. బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్‌లో కర్ణుడి పాత్రలో మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత(1994–1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా సడక్, బాద్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.
అయితే అనితా ధీర్‌ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా నటనలో రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నికితిన్ బుల్లితెర నటి క్రతికా సెంగర్‌ను వివాహం చేసుకున్నాడు. అతను తన తండ్రి పంకజ్ ధీర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.
Actor Pankaj Dheer, played Karn in Mahabharat, Passed Away.
Om Shanti🙏#pankajdheer pic.twitter.com/uJSTFoOb4b— Sumit Kadel (@SumitkadeI) October 15, 2025