
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధరలో కనిపించనుంది. ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ కూడా కీ రోల్ ప్లే చేయనుంది.
ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆమె తన భర్తతో కలిసి దివాళీ బాష్‌కు హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్‌లో కనిపించి సందడి చేసింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీపై వస్తున్నా వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. మానవ చరిత్రలోనే ప్రెగ్నెన్సీలో ప్రపంచ రికార్డ్ అని పోస్ట్ చేసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికీ నేను 16 నెలల గర్భంతో ఉన్నానంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది. తమపై వస్తున్న వార్తలపై మా స్పందన ఇలానే ఉంటుందని సోనాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. గత కొన్ని నెలలుగా సోనాక్షి ఎక్కడా కనిపించినా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ రియాక్ట్ అయింది. కాగా.. సోనాక్షి సిన్హా.. జూన్ 2024లో జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్నారు.