'దంగల్' నటి ఇంట్లో విషాదం.. ట్వీట్ వైరల్ | Sakshi
Sakshi News home page

Zaira Wasim: నటి జైరా వాసిం ఇంట్లో విషాదం

Published Wed, May 29 2024 8:19 AM

Dangal Actress Zaira Wasim Father Passed Away

'దంగల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి జైరా వాసిం ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె తండ్రి జహిద్ వాసిం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా జైరా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?)

ఇకపోతే జమ్ము కాశ్మీర్‌లో పుట్టి పెరిగిన జైరా వాసిం.. ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో గీతా ఫొగట్ పాత్రలో బాలనటిగా ఆకట్టుకుంది. దీని తర్వాత ఆమిర్ ఖాన్‌తో 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే మూవీలో మరోసారి కలిసి నటించింది. 'స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ 2019లో తాను ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. ఇకపై నటించనని క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)

Advertisement
 
Advertisement
 
Advertisement