
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. 2023లో రాజకీయ నాయకుడితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించింది. గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించింది. ప్రస్తుతం కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటించింది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే హీరోయిన్ పరిణితి చోప్రా బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే పరిణీతికి మరో స్టార్ హీరోయిన్ గిఫ్ట్‌ను పంపి సర్‌ప్రైజ్ ఇచ్చింది. డెలివరీకి ముందే పుట్టబోయే బిడ్డ కోసం బహుమతి పంపిన విషయాన్ని పరిణీతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.
(ఇది చదవండి: అలాంటి డ్రెస్‌లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ చేసినట్టేనా!)
మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న పరిణీతి చోప్రాకు స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన సొంత బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా నుంచి సరికొత్త హ్యాంపర్‌ను గిఫ్ట్‌గా పంపింది. ఆలియా భట్ బహుమతిపై పరిణీతి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన బిడ్డకోసం గిఫ్ట్ పంపినందుకు ధన్యావాదాలు తెలిపింది. కాగా.. పరిణితి చోప్రా ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కనిపించింది. ఆ తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకుంది.
అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి.