
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీలో కీలక పాత్రలో కనిపిచంనుంది. ఇటీవలే సోనాక్షి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. స్పెషల్ సాంగ్‌ను సైతం విడుదల చేశారు. ధన పిశాచి పేరుతో విడుదలైన పాట ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ మూవీలో సోనాక్షి విలన్ లాంటి పాత్రలో కనిపించనుంది. టీజర్‌లోనూ సోనాక్షి లుక్స్ అభిమానులను అలరించాయి.
అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ముంబయిలో జరిగిన వెడ్డింగ్ వేడుకలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. అయితే గత కొన్ని రోజులుగా సోనాక్షి ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరు జంటగా ఓ ఈవెంట్‌లో కనిపించారు. ఇందులో సోనాక్షి వదులుగా ఉండే అనార్కలి సూట్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి గర్భవతి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆమె ఫేస్ చూస్తుంటే ఈ వార్త నిజమేనని అనిపిస్తోందని ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. ఫోటోలకు పోజులిచ్చే సమయంలో సోనాక్షి తన చేతితో బేబీ బంప్‌ను దాచేందుకు ప్రయత్నించిందని మరికొందరు పోస్టులు పెట్టారు.
అయితే ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి, జహీర్ ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. ఈ ఏడాది జూలైలోనూ సోనాక్షి తాను ఎప్పుడూ గర్భవతి అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారో వెల్లడించింది. జహీర్‌తో తన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. అయితే జహీర్‌తో పెళ్లి తర్వాత సోనాక్షిని నెట్టింట తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.