
‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దుబాయ్‌లో జోరుగా జరుగుతున్నాయని తెలిసింది. గతంలో రామ్‌చరణ్, సుకుమార్ కలిసి ఈ సినిమా కథా చర్చల కోసం దుబాయ్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దుబాయ్‌లో ఉంటూ, ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట.
ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కృతీ సనన్, సమంత వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలోని ఈ సినిమా వచ్చే మార్చి 27న రిలీజ్ కానుంది.