
కొద్ది నెలలగా సమంత సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. శుభం మూవీ తర్వాత ఆమెపై ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సామ్ సైతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతోనే ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. గతంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీరిద్దరిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం సమంత ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లింది. ఆ తర్వాత తన సోషల్ మీడియాలోఓ వ్యక్తి చేతిని పట్టుకున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ నేపథ్యంలోనే రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. 'తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి' అంటూ కొటేషన్ షేర్ చేసింది. అంతేకాకుండా 'నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత, రాజ్ దుబాయ్ వీడియో రిలీజ్ తర్వాతే ఆమె ఈ పోస్టులు పెట్టింది.
కాగా.. రాజ్ నిడిమోరు.. శ్యామలిని 2015లో వివాహమాడారు. కొద్ది నెలలుగా సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. అయినప్పటికీ వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్పై అధికారికంగా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే వస్తే రాజ్ డైరెక్షన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2,స సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో సమంత నటించింది. ప్రస్తుతం వీరిద్దరు రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సామ్.. 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను గతేడాది పెళ్లాడారు.
