
టాలీవుడ్ హీరోయిన్ సమంత(samantha ruth Prabhu) ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. శుభం మూవీ నిర్మించిన సామ్.. ఆ తర్వాత కొత్త మూవీస్ ప్రకటించలేదు. అయితే కెరీర్ పరంగా కాస్తా వెనకపడినా సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.
అయితే సినిమాల కంటే ఎక్కువగా.. రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దుబాయ్లో జంటగా కనిపించిన వీరిద్దరు.. మరోసారి కెమెరాలకు చిక్కారు. ముంబయి బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సామ్, రాజ్ బయటికి వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గతంలో వీరిద్దరు హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత చాలాసార్లు వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు. దీంతో ఈ సామ్, రాజ్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తమపై వస్తున్న రూమర్స్పై సమంత, రాజ్ స్పందించలేదు. కాగా.. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సామ్.. 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/PlDCMUqD4Q
— Samcults (@Samcults) September 23, 2025