
మరో తెలుగు హీరోయిన్ వివాదంలో నిలిచింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుతో వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సదరు మేకప్ ఆర్టిస్ట్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ సంగతి బయటపడింది. సదరు హీరోయిన్, ఆమె తల్లిపై లేడీ మేకప్ ఆర్టిస్టు సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?
'గత కొన్నిరోజులుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమె టీమ్, కుటుంబ సభ్యులు అయితే చాలా స్టుపిడ్‌గా ప్రవర్తిస్తున్నారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్, మెసేజ్ చేయకు'
(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం)
'ఆమె కుటుంబానికి చెందిన ఓ మనిషి.. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పనిచేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈసారి మీ పేర్లు బయటపెడతాను' అని సదరు మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
విషయానికొస్తే.. రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. అయితే నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసే మేకప్ ఆర్టిస్టులని ఈ హీరోయిన్ తల్లి వద్దని చెబుతోందట. బదులుగా వేరే వాళ్లని పెట్టుకుని వాళ్లకు డబ్బులిస్తోంది. అయితే మేకప్ ఆర్టిస్టులకు ఎంత డబ్బులు ఇస్తుందో అంతకు రెట్టింపు.. నిర్మాత నుంచి వసూలు చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?)
