
యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఈ ఏడాది 'రాబిన్‌హుడ్', 'జూనియర్' సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈనెల 31న 'మాస్ జాతర' మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్ స్టాలో కొత్తగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్‌గా మారింది.
(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)
'ఏజెంట్ మిర్చి'గా శ్రీలీల.. అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్‌గా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', శివకార్తికేయన్ 'పరాశక్తి', కార్తిక్ ఆర్యన్‌తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన వరస చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ధమాకా', 'భగవంత్ కేసరి'తో పాటు 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవి ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్‌పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)