
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేశ్ నటించనున్న చిత్రం ఏంటి? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే హీరో వెంకటేశ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే ప్రచారం ఇండస్ట్రీలో చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ వెంకటేశ్ తర్వాతి చిత్రం మాత్రం త్రివిక్రమ్‌తోనే అని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుందనుకున్నారంతా.
అయితే తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి ఓకే చెప్పారు అల్లు అర్జున్. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం ఏడాది అయినా పడుతుంది. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్.. వెంకటేశ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారని టాక్. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా రుక్మిణీ వసంత్ నటించనున్నారని సమాచారం.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా జూన్ 6న అధికారికంగా ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా రుక్ష్మిణీ వసంత్‌ని ఎంపిక చేశారట. నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(2024) సినిమాతో రుక్మిణీ వసంత్ తెలుగుకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.