
నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి నుంచి శోభిత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నట్లు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. రీసెంట్‌గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే శోభిత.. ఓటీటీ మూవీని పూర్తి చేసిందని, వచ్చే నెలలోనే ఇది రిలీజ్ కానుందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)
వైజాగ్‌కి చెందిన శోభిత.. తొలుత మోడలింగ్ చేసింది. 2016 నుంచి సినిమాలు చేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది. అయితే 'చీకట్లో' అనే ఓటీటీ మూవీలో శోభిత నటించింది. కానీ దీని గురించి ఎక్కడా చిన్న అప్‌డేట్ కూడా లేదు. సురేశ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడట.
'చీకట్లో' పేరుతో తీసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 18న రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ మూవీని ఏకంగా 18 భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌లోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇదంతా అనధికారికంగా బయటకొచ్చిన ఇన్ఫర్మేషన్. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు కూడా రావొచ్చు. శోభిత భర్త, హీరో నాగచైతన్య ప్రస్తుతం హారర్ జానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్)