ట్విస్ట్‌ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్‌ సినిమాలపై ప్రకటన | Producer Naga Vamsi Comments On Trivikram Next Two Projects | Sakshi
Sakshi News home page

ట్విస్ట్‌ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్‌ సినిమాలపై ప్రకటన

Jun 12 2025 12:48 PM | Updated on Jun 12 2025 1:31 PM

Producer Naga Vamsi Comments On Trivikram Next Two Projects

రెండురోజుల నుంచి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) పేరు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. ఆయన చేయబోయే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్‌తో అన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. త్రివిక్రమ్‌ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేశ్‌తో చేస్తారని చెప్పుకొచ్చారు. మరొకటి ఎన్టీఆర్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చేతిలో ఈ రెండు తప్పా ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేవన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్‌చేస్తున్నారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. త్రివిక్రమ్‌కు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్‌ ఫైనల్‌ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని  నాగవంశీ తెలిపారు.

(ఇదీ చదవండి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్‌.. బన్నీ కథలో మార్పులు!)

నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో  త్రివిక్రమ్-రామ్ చరణ్ ప్రాజెక్ట్‌ లేనట్టేనని తేలిపోయింది. ఆపై అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా పూర్తిగా ప్రచారం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లు మాత్రమే త్రివిక్రమ్‌ ప్రస్తుతానికి లాక్ చేశారంటూ  నాగవంశీ చెప్పారు. అయితే, మొదట వెంకటేశ్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్‌తో భారీ ప్రాజెక్ట్‌ మొదలౌతుందని  చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. పురాణాలతో ముడిపడిన కథలో ఎన్టీఆర్‌ నటించనున్నారు. 

మోస్ట్‌ పవర్‌ఫుల్‌ గాడ్‌ పాత్రలో తారక్‌ అన్న నటిస్తున్నారంటూ ఇప్పటికే నాగవంశీ ఒక పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తారక్‌ నటిస్తున్నారని టాక్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో వార్‌2, ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్‌, దేవర్‌2 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు నాగవంశీ ట్విస్ట్‌ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement