
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.
అయితే ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్‌లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్‌తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌తో ఎన్టీఆర్‌తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.
ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్‌వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్‌తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్‌డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్‌తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw
— Naga Vamsi (@vamsi84) June 11, 2025
My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd
— Naga Vamsi (@vamsi84) June 11, 2025