
హలో పిల్లలూం. మనకు ప్రపంచ వింతలంటే ఠక్కున గుర్తొచ్చేవి – ది గ్రే వాల్ ఆఫ్ చైనా, పెట్రా, క్రైస్ట్ ది రిడీమర్, మచ్చు పిచ్చు, చిచెన్ ఇట్జా, రోమన్ కొలోసియం, మనందరికీ ఇష్టమైన తాజ్ మహల్. ఈ ఏడు వింతలు తప్ప మరొకటి జ్ఞప్తికి రావు. ఇవి ఎంతో అందమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, కట్టడాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మాతలు. మనకంటే ముందు జీవించిన మన పితరులు వివిధ కాలాలలో, విభిన్న సందర్భాలలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి. కానీ ఈరోజు మనం, మానవ ప్రమేయం లేకుండా ప్రకతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలోని ఏడు సహజసిద్ధమైన అద్భుతాలు (seven natural wonders of the World)
1. గ్రాండ్ కాన్యన్ (Grand Canyon)
అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనాలో ఉంది. కొలరాడో నది సష్టించిన ఈ కాన్యన్ దాదాపు 446 కిలోమీటర్ల ΄÷డవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.6 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.
2. గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef )
ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది 2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసం.
3. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ (Amazon Rainforest)
దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ‘‘ప్రపంచ ఊపిరితిత్తులు’’ గా పిలువబడుతుంది. ఇది అమెజాన్ నది చుట్టూ విస్తరించి ఉండటంతోపాటు భూమ్మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జాతుల జంతుజాలం, వక్షజాలానికి నిలయం.
4. విక్టోరియా జలపాతం (Victoria Falls)
ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే సరిహద్దులో ఉన్న ఈ జల΄ాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లయితే, ఎత్తు 108 మీటర్లు.

5. ఆరోరా బోరియాలిస్ (Aurora Borealis Northern Lights)
ఉత్తర ధ్రువ ప్రాంతాలలో (నార్వే, స్వీడన్, ఫిన్లాండ్) కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దశ్యం సౌర కణాలు భూమి వాతావరణంతో సంకర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది. ఈ దశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకతి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ లా ఉంటాయి.
6.పారిసెలో రాక్ (Paricutin Volcano)
మెక్సికోలోని ఈ అగ్నిపర్వతం 1943లో ఒక రైతు భూమిలో ఏర్పడింది. ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే 424 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణింపబడుతుంది.
7. మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest, Mount in Asia )
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాలలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపుతుంటారు.