అమ్మ బర్త్‌ డే.. ఐకాన్ స్టార్‌ స్పెషల్ పోస్ట్! | Allu Arjun shares sweet birthday wish for mother Nirmala | Sakshi
Sakshi News home page

Allu Arjun: అమ్మ బర్త్‌ డే.. ఐకాన్ స్టార్‌ స్పెషల్ పోస్ట్!

Jun 21 2025 4:43 PM | Updated on Jun 21 2025 5:26 PM

Allu Arjun shares sweet birthday wish for mother Nirmala

గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే తాజాగా ఇవాళ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోను షేర్ చేశారు.  హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం నిర్మలమ్మకు బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు.

అవార్డుల అల్లు అర్జున్‌..

పుష్ప-2 సినిమాకు గానూ 'అల్లు అర్జున్‌' ఉత్తమ నటుడిగా 'గద్దర్‌' అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా గద్దర్‌ తొలి అవార్డ్‌ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్‌ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలిచారు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కాగా..  బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే ఉత్తమ నటుడిగా  11సార్లు నామినేట్‌ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్‌ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్‌ను ఆయన సొంతం చేసుకున్నాడు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement